P.LAKSHMAN RAO

సాహిత్యాభిమానులారా....నా "కవితాలోచనం"కు స్వాగతం...సుస్వాగతం....ఈ బ్లాగ్ లో నాకవిత్వాన్ని చదివి మీ విలువైన అభిప్రాయాలను comment రూపంలో తెలుపగలరని ఆశిస్తున్నాను.pothubari@gmail.com అనే నా మెయిల్ కుగాని,9441215989 అనే నెంబర్ కు గాని మీ స్పందన తెలుపగోరుచున్నాను. ~ పి.లక్ష్మణ్ రావు

Monday, 5 May 2014

Gaaju Mukka Poetry book by P.Lakshmanrao

Posted by P.LAKSHMAN RAO at 18:46 3 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Chirudeepam by P.Lakshman Rao

Posted by P.LAKSHMAN RAO at 16:44 2 comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

P.LAKSHMAN RAO

సంగీత సాహిత్యాలలో "నవరసాలూరు"సాలూరు (విజయనగరం జిల్లా)లో జన్మించారు పి.లక్ష్మణ్ రావ్. వీరు సంస్కృతి-వారసత్వం,మనుషులు-మనసులు,ప్రకృతి-పరిసరాలు,పురస్కారాలు-తిరస్కారాలు,అవమానం-రాజ్యపూజ్యం వంటి అనుభవాలను,సమాజాన్ని చదివారు.

"అందరికోసం ఒక్కడు-ఒక్కదికోసం అందరు" అనే నినాదమే ధ్యేయమైన ఆంధ్రప్రదేశ్ సహకారశాఖ,విజయనగరంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు.

ఏకాకిగోల(కవితా సంపుటి), నావి-నీవి(నానీలు సంపుటి), భావచిత్రాలు(హైకూ సంపుటి), రుతువిహంగం(అక్షరనియమంతో కూడిన హైకూ సంపుటి), అగ్నివృక్షం(దీర్ఘ కవితా సంపుటి), తీరని దాహం(నానీలు సంపుటి), మెరుపు శబ్దం(మినీ కవితా సంపుటి), కొంచెం నిప్పు-కొంచెం నీరు (సాహిత్య వ్యాస సంపుటి), ప్రవర్తన-పరివర్తన (చింతన వ్యాస సంపుటి), గాజుముక్క(వచనకవితా సంపుటి), నీటిబొట్టు(నానీలపై వచ్చిన సమీక్షా వ్యాస సంపుటి) మొదలగు గ్రంధాలను రచించారు. అన్ని పుస్తకాలు పునర్ముద్రణను పొందాయి.

వీరి సాహిత్య కృషికి...ఉత్తమ రచనలకు,ఉత్తమ ప్రభుత్వ సేవలకుగాను రంజని-కుందుర్తి 2005 , ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవ జిల్లా పురస్కారం 2006 ,యువకవి ప్రతిభా పురస్కారం 2008 (సాహితీ మిత్రులు,మచిలీపట్నం), ఉడా,విశాఖ ఉగాది పురస్కారం 2007 (సర్వజిత్ ), ఉడా,విశాఖ ఉగాది పురస్కారం 2007 (సర్వధారి ), అధికార భాషా సంఘం హైదరాబాద్ వారిచే భాషా సత్కార పత్రం 2008 , భారతీ తీర్థ(యు.ఎస్.ఎ.) విజయనగరం వారిచే జిల్లా కలెక్టర్ వారి ద్వారా సన్మానం 2009 , ఆంద్ర సారస్వత సమితీ-మచిలీపట్నం వారి ఉగాది పురస్కారం 2010 (వికృతి) ,"మానాన్న"రాష్ట్రస్థాయి కవితల పోటీలో తృతీయ బహుమతి 2010 , ఇండియన్ హైకూ క్లబ్ వారి ఉత్తమ వ్యాస రచయిత అవార్డ్ 2010 , చైతన్య భారతి-గణపతి నగరం ఉగాది పురస్కారం 2011 (శ్రీఖర)...ఇలా ఎన్నో అవార్డులు...పురస్కారాలు..సన్మాన-సత్కారాలు పొందారు.

నానీలు

పి.లక్ష్మణ్ రావ్
నానీలు
* * * * *

ఎదుటివాడు
ఎదుగుతున్నాడా?
అకటా! ఎంత ఘోరం
జరిగిపోతుంది!

హత్యలకు
పకడ్బందీ వ్యూహం
నేడే చూడండి
ధారావాహికలు!

తేలికైనది
కువిమర్శ
మరి కష్టమైనది
ఆత్మ విమర్శే!
("నావి-నీవి"నుండి..)


పేదల బతుకుల్లో
దారిద్ర్య రేఖ
ధనవంతులు గీస్తున్న
లక్ష్మణ రేఖ!

మహా నగరమని
నిర్ధారణ
మురికి పేటల సంఖ్య
ఆరోహణ!

ఎన్నికలు
కప్పల తక్కెడ
మరి వాగ్ధానాలు!?
చిల్లుల బొక్కెన!

ఆది మానవుడు
మూగ జీవి
మరి ఆధునిక మానవుడు?!
క్రూర జీవి!
("తీరని దాహం" నుండి...)

మినీ కవితలు

పి.లక్ష్మణ్ రావ్
మినీ కవితలు
* * * * *

పరమార్థం
తాటిచెట్టు నీడనివ్వదు
అయితేనేం...?
తాటి చెట్టు కల్పతరువు
బోధిచెట్టు బుద్ధుని గురువు
* * * * *

ఔరా ...!
నేరం చేయని
ముద్దాయికి
జైలు!

నేరం చేసిన
హంతకునికి
బెయిలు!
* * * * *

పెద్దల మాటలు...

"లక్ష్మణరావు నానీలకు మంచి పేరొచ్చింది. నానీల ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చినవారిలో లక్ష్మణరావు ఒకడు. అతడు అంతటితో ఆగక నానీ కవులను గూర్చి వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశాడు.నానీల కవిగా లక్ష్మణరావుకు రెండు పురస్కారాలు లభించాయి."~ డా.ఎన్.గోపి

"నానీ కవులనుండే విమర్శకులు కూడా ఎదగాలనే నా ఆశయాన్ని సాధించే దిశగా ప్రయాణిస్తున్న లక్ష్మణ్ రావ్ కు అభినందనలు." ~ డా.ఎన్.గోపి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు, హైదరాబాద్.

"లక్ష్యం స్వచ్చమైనపుడు లోకమంతా స్నేహపిచ్చిలమౌతుంది. స్నేహార్థమైన ఆ సౌమనస్యంతో కవి,విమర్శకుడు అయిన లక్ష్మణ్ రావ్ నానీ కవులకు, సహృదయ పాఠకులకు ఏకకాలంలో హితము,మనోహరి అయిన విమర్శను అందించగలిగారు."~ డా.ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి ,ప్రసిద్ధ విమర్శకులు,విజయనగరం

"" మిత్రుడు లక్ష్మణ్ రావ్ కలంలో బలం ఉంది. విమర్శకుడుగా ఎదిగే లక్ష్యం ఉంది.అభినందనలు."~డా.మసన చెన్నప్ప,ప్రొఫెసర్,ఉస్మానియా యూనివర్సిటీ ,హైదరాబాద్

"లక్ష్మణ్ రావ్ అన్ని ప్రక్రియలు రచిస్తూ, సమన్వయమూర్తిగా ఎదగడమే కాకుండా సద్విమర్శకుడుగా సాహిత్యంలో చోటు సంపాదించుకుంటాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది."~డా.రావి రంగా రావు,రీడర్,ఆంధ్రజాతీయ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్,మచిలీపట్నం.

"పి.లక్ష్మణ్ రావు మంచి కవి. అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ ప్రవేశించినవాడు.వచనకవితలు రాశాడు.మినికవితలు రాశాడు.నానీలు రాశాడు.హైకూలు రాశాడు. ఇలాంటివే ఏ కొత్త ప్రక్రియలున్నా రాస్తాడు. ప్రక్రియ ఏదైనా, అందులో కవిత్వం ముఖ్యం......లక్ష్మణ్ రావు కు శుభాభినందనలు.~ డా.రావి రంగారావు

"లక్ష్మణరావు మెరుపులాగ కవిత్వం రాస్తున్నాడు.అటు నానీలు,ఇటు హైకూలు,మరోదిక్కు మినీలు, అదీగాకుండా పత్రికల్లో విమర్శనా వ్యాసాలు...సాహిత్య వ్యవసాయం బాగా సాగుతుంది.శుభాకాంక్షలు! ~ అన్నవరం దేవేందర్

"మెరుపు శబ్దంలోని మినీ కవితలు మెనీ ఆలోచనలతో ఉన్నాయి.మంచి కవిత్వం ఉంది. సమాజంపట్ల పలురకాల ఆలోచనలు కన్పిస్తున్నాయి. రకరకాల స్పందనలు, సంఘటనలు,అనుభూతులను అక్షరమయం చేసేవాడు కవి. కవిత్వం ఒక జీవకళ. మీ కవిత్వం అల్లిక బాగుంది. పలు సమస్యలు పట్టుకున్నారు". ~ అన్నవరం దేవేందర్

Pages

  • Home
  • Contact

TEERANI DAAHAM (Naaneelu)

PRAVARTHANA-PARIVARTHANA(Chinthana Essays)

NEETI BOTTU (Essays on Naanee Poetry Reviews)

NAAVI-NEEVI (Naaneelu)

MERUPU SHABDAM (Mini Poetry)

KONCHEM NIPPU-KONCHEM NEERU (Literary Essays)

GAAJU MUKKA (Free-Verse Poetry)

DAGAA DAGAA DHAGA DHAGA (Essays)

BHAVACHITHRAALU(HAIKU POETRY)

AGHNI VRUKSHAMU(LONG POETY)

Total Pageviews

Labels

  • PHOTOS (2)
  • SLIDE SHOWS (5)
  • VIDEOS (2)

Followers

Blog Archive

  • ▼  2014 (2)
    • ▼  May (2)
      • Gaaju Mukka Poetry book by P.Lakshmanrao
      • Chirudeepam by P.Lakshman Rao
  • ►  2013 (1)
    • ►  November (1)
  • ►  2011 (10)
    • ►  September (10)

About Me

My photo
P.LAKSHMAN RAO
సంగీత సాహిత్యాలలో "నవరసాలూరు"సాలూరు (విజయనగరం జిల్లా)లో జన్మించారు పి.లక్ష్మణ్ రావ్.ఏకాకిగోల(కవితా సంపుటి), నావి-నీవి(నానీలు సంపుటి), భావచిత్రాలు(హైకూ సంపుటి), రుతువిహంగం(అక్షరనియమంతో కూడిన హైకూ సంపుటి), అగ్నివృక్షం(దీర్ఘ కవితా సంపుటి), తీరని దాహం(నానీలు సంపుటి), మెరుపు శబ్దం(మినీ కవితా సంపుటి), కొంచెం నిప్పు-కొంచెం నీరు (సాహిత్య వ్యాస సంపుటి), ప్రవర్తన-పరివర్తన (చింతన వ్యాస సంపుటి), గాజుముక్క(వచనకవితా సంపుటి), నీటిబొట్టు(నానీలపై వచ్చిన సమీక్షా వ్యాస సంపుటి) మొదలగు గ్రంధాలను రచించారు.
View my complete profile
Picture Window theme. Powered by Blogger.